బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 25, 2020 , 00:14:45

ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం తోడ్పాటు

ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం తోడ్పాటు

    బేతి సుభాష్‌రెడ్డి

 ఉప్పల్‌ : ప్రజా ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. కాలనీవాసులు వ్యాయామం చేయడానికి ఓపెన్‌ జిమ్‌లు దోహదం చేస్తాయన్నారు. హబ్సిగూడ డివిజన్‌లోని స్నేహనగర్‌ కాలనీపార్కులో సోమవారం కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డితో కలిసి ఓపెన్‌జిమ్‌ను ప్రారంభించారు. గరిక సుధాకర్‌, శివ, లక్ష్మీనారాయణ, రెహ్మన్‌, శ్రీధర్‌, వినీశ్‌రెడ్డి, నాని, సంపత్‌, అక్బర్‌, కాలనీవాసులు పాల్గొన్నారు. 

దివ్యాంగుడికి వీల్‌చైర్‌ అందజేత.. చిలుకానగర్‌ డివిజన్‌ బీరప్పగడ్డకు చెందిన లస్కర్‌(29)కు హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో డివిజన్‌ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి వీల్‌చైర్‌ అందజేశారు. గరిక సుధాకర్‌, లక్ష్మీనారాయణ, కొకొండ జగన్‌, శివ పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులు ప్రారంభం..  హబ్సిగూడ డివిజన్‌ సత్యనారాయణస్వామి నగర్‌ కోదండరామస్వామి దేవాలయం ప్రాంతంలో సోమవారం సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ స్వప్నారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను సూచించారు. కాలనీప్రతినిధులు ప్రదీప్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి, అశోక్‌రెడ్డి, యాదవరెడ్డి, లక్ష్మీనారాయణ, వినీశ్‌రెడ్డి పాల్గొన్నారు.