మంగళవారం 11 ఆగస్టు 2020
Rangareddy - Jul 05, 2020 , 23:55:16

స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి

స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి

కందుకూరు : స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మున్సిపాల్‌ శాఖ  మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ‘ఆదివారం ఉదయం 10గంటలకు 10నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్‌కాలనీలోని తన నివాసంలో వివిధ రకాల మొక్కల కుండీలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నీటి నిల్వలు ఉండే డ్రమ్ములు, కూలర్ల నుంచి వారంలో ఒకసారి పూర్తిగా నీళ్లు తీసివేసి.. శుభ్రం చేసి వాడుకోవాలన్నారు. లేని పక్షంలో నిల్వ ఉన్న నీటిలో లార్వా వృద్ధి చెంది.. తద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి తెలిపారు.


logo