శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Sep 15, 2020 , 00:34:21

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ...  సాలార్‌పూర్‌ గ్రామానికి చెందిన బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

కడ్తాల్‌ : పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని సాలార్‌పూర్‌ గ్రామానికి చెందిన పవన్‌కల్యాణ్‌, భారతమ్మ అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందారు. అనంతరం వారు వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సహకరించడంతో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి పవన్‌కల్యాణ్‌కు రూ.15 వేలు, భారతమ్మకు రూ.12 వేలు మంజూరయ్యాయి. సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ చెక్కులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వార ఎంతోమంది పేద ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పత్యానాయక్‌, బాబా తదితరులు పాల్గొన్నారు.