సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Sep 09, 2020 , 00:57:16

మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

మత్స్యకారుల అభ్యున్నతికి  ప్రభుత్వం కృషి

చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

 కొత్తూరు రూరల్‌: మత్స్యకారుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ అన్నారు. కొత్తూరు మండలకేంద్రంలోని రాధాగార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో మత్స్యపారిశ్రామిక సహకార సంఘంం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేశారు. మత్య సంఘం నాయకులు సురేశ్‌ముదిరాజ్‌, మాసుల అంజయ్య  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభు త్వం అన్ని కులాలు, మతాల వారి అభివృద్ధికి పాటుపడుతున్నదని అన్నారు. అందులో భాగంగానే వివిధ వర్గాల ప్రజలకు గొర్రెలు, బర్రెలు, చేపపిల్లల పంపిణీ వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు. చేపలను అమ్మేందుకు మత్స్యకారులకు వాహనాలను సబ్సిడీపై అందచేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ గణేశ్‌ముదిరాజ్‌, ఆర్డీఓ రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీలతాసత్యనారాయణ, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ చైర్మన్‌లు, వైస్‌చైర్మన్‌ పద్మారావు, నాయకులు, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం నాయకులు పాల్గొన్నారు.

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని కల్యాణలక్ష్మి

కొత్తూరు: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. కొత్తూరు మండల కేంద్రంలోని రాధా గార్డెన్‌లో 97 కల్యాణలక్ష్మి, 17 షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు పేదలు రుణపడి ఉండారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌, ఆర్డీవో రాజేశ్వరి, తాసిల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి జడ్పీటీసీ శ్రీలతా సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ శోభా లింగ్యానాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీర్‌ఎస్‌ మండల నాయకులు పాల్గొన్నారు. 

ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం ఆగదు..

కరోనా వైరస్‌ విజృంభణతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని ఎమ్మెల్మే అంజయ్య యాదవ్‌ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని హైస్కూల్‌హాల్‌లో 67 కల్యాణలక్ష్మి, 5 షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నా సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నామని వివరించారు. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంక శివశంకర్‌, మేకగూడ పీఏసీఎస్‌ చైర్మన్‌ మంజులారెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.