మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Jul 11, 2020 , 01:03:10

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

శంషాబాద్‌: రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. మండల పరిధిలోని ఐదు రైతు కుటుంబాలకు రైతుబీమా ప్రొసిడింగ్స్‌ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతు బీమాను వినియోగించుకోవాలన్నారు. బీ మా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నదని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్‌, జడ్పీటీసీ తన్వి రాజు ముదిరాజ్‌, ఏడీఏ లీనా, ఏవో కవిత, ఎంపీడీవో జగన్మోహన్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 పీపీఈ కిట్లు అందజేత.. 

బండ్లగూడ:  కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎంటమాలజీ సిబ్బంది పరిసరాల పరిశుభ్రతకు ఎంతో కృషి చేస్తున్నారని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు.  శుక్రవారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో  పని చేస్తున్న ఎంటమాలజీ సిబ్బందికి  పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌  మైలార్‌దేవ్‌ డివిజన్‌ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్‌,అమరేందర్‌, వెంకటేశ్‌,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.