బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 31, 2020 , 01:33:43

ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న జీహెచ్‌ఐఏఎల్‌

ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న జీహెచ్‌ఐఏఎల్‌

నేషనల్‌ ఎనర్జీ లీడర్‌, ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌..

అవార్డులను ఖాతాలో వేసుకున్న శంషాబాద్‌ విమానాశ్రయం 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), గోద్రేజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ (జీబీసీ) నిర్వహించిన ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌' 21వ జాతీయ అవార్డులలో జీఎమ్మార్‌ ఆధ్వర్యంలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్‌ఐఏఎల్‌) ప్రతిష్టాత్మక  నేషనల్‌ ఎనర్జీ లీడర్‌, ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ యూనిట్‌ అవార్డులను గెల్చుకుంది. ఆగస్టు 6-28 మధ్య నిర్వహించిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్‌ వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ ఆన్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ సందర్భంగా వీటిని ప్రకటించారు. ఆగస్టు 6-28 మధ్య నిర్వహించిన ‘ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్‌' వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ ఆన్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ సందర్భంగా వీటిని ప్రకటించారు. జీహెచ్‌ఐఏఎల్‌ నేషనల్‌ ఎనర్జీ లీడర్‌, ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ యూనిట్‌ అవార్డులను గెలుచుకోవడం ఇది వరుసగా 4వ, 2వ సారి కావడం విశేషం.