సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Jul 14, 2020 , 00:58:21

ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు

ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు

బండ్లగూడ: నియోజకవర్గ పరిధిలో నాలుగు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం అధికారులతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని దుర్గానగర్‌, కాటేదాన్‌, సాయినగర్‌, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సన్‌సిటీ వద్ద ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ ప్రదీప్‌కుమార్‌, ఈఈ అంజయ్య డీఈ సంగప్ప పాల్గొన్నారు.