శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Sep 19, 2020 , 00:26:04

‘ఓటరు నమోదుపై దృష్టి సారించాలి’

‘ఓటరు నమోదుపై దృష్టి సారించాలి’

  ఉప్పల్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదుపై దృష్టిసారించాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడలో ఓటరు నమోదుపై సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుపై దృష్టిసారించాలన్నారు.  హబ్సిగూడ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వనంపల్లి గోపాల్‌రెడ్డి, నందికంటి శివ, శ్రీధర్‌, రెహమాన్‌, రవినాయక్‌, లింగనాయక్‌ పాల్గొన్నారు. 

ప్రజాసంక్షేమానికి తోడ్పాటునందిస్తాం.. ప్రజాసంక్షేమానికి తోడ్పాటు నందిస్తామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా ప్రజలకు వైద్యఖర్చులు అందజేస్తూ  సహకారం అందిస్తున్నామని తెలిపారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డి అందజేశారు. మల్లేశ్‌కు రూ.32 వేలు, జ్యోతిలక్ష్మికి రూ.60 వేల చెక్కులను అందజేశారు