శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Aug 15, 2020 , 23:47:14

మురిసిన మువ్వన్నెలు

మురిసిన మువ్వన్నెలు

మహేశ్వరం, రాజేంద్రనగర్‌ నియోజక వర్గాల్లో 74వ స్వాతంత్య్ర వేడుకలు శనివారం నిరాడంబరంగా నిర్వహించారు.  ప్రభుత్వ  ప్రైవేట్‌ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.  క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మేయర్‌ మహేందర్‌గౌడ్‌, బడంగ్‌పేటలో మేయర్‌ చిగిరింత పారిజాత,  మీర్‌పేటలో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌ జెం డాను ఆవిష్కరించారు. దేశం కోసం అసువులు బాసిన వీరుల  త్యాగాలు మరువలేనివని అన్నారు.

 -మహేశ్వరం, రాజేంద్రనగర్‌