గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 14, 2020 , 00:46:57

మంత్రి సబితారెడ్డిని కలిసిన రైతులు

మంత్రి సబితారెడ్డిని కలిసిన రైతులు

మాడ్గుల ః మాడ్గుల మండలంలోని డీఎల్‌ 82 కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా కాల్వల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం రూ.16లక్షలు ఇవ్వాలని ఆదివారం రైతులు మంత్రి సబితారెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మండలంలోని నాగిళ్ళ, అప్పారెడ్డిపల్లి, నల్లవారిపల్లి, అవురుపల్లి, కలకొండ, చంద్రాయణపల్లి, దొడ్లపహాడ్‌, నర్సాయిపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల నుంచి కల్వకుర్తి లిప్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుతం ఇచ్చే 8 లక్షల రూపాయలు మార్కెట్‌ వాల్యుకు సరిపోవని 16 లక్షలకు పెంచాలని టీఆర్‌ఎస్‌ నాయకులు యాదవ్‌రెడ్డి, చలమందగౌడ్‌, మల్లేశ్‌మాదవ్‌, రైతులు మంత్రి సబితారెడ్డిని కోరారు. రైతుల నష్టపరిహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు.