షాబాద్ : దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు గాను దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడగించినట్లు రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సుల వివరాలు, దరఖాస్తు ఫారం, అర్హత ప్రమాణాలు wdsc.telangana.gov.in వెబ్సైట్లో లభిస్తాయన్నారు. అర్హత గల దివ్యాంగులకు ఉచిత శిక్షణ వసతి కల్పిస్తామన్నారు. అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో పాటు నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తి చేసి wdscskilldevelopment@gmail.com కు మెయిల్ చేయాలని, లేదా డైరెక్టర్, వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ కార్యాలయం, వికలాంగుల భవనం, నల్గొండ క్రాస్ రోడ్స్, మలక్పేట, హైదరాబాద్ (040-245590480)కు పంపాలని సూచించారు.