గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jun 28, 2020 , 01:07:23

ప్రతి మొక్కను సంరక్షించాలి

ప్రతి మొక్కను సంరక్షించాలి

ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

కొత్వాల్‌గూడలో మొక్కలు నాటిన నాయకులు 

శంషాబాద్‌:  మొక్కలు నాటి సంరక్షించుకోవాలని ఎమ్మె ల్యే ప్రకాశ్‌గౌడ్‌  సూచించారు.  శనివారం మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడ గుట్టల ప్రాంతంలో నాయకు లతో కలిసి మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని తెలిపారు. హరితహారంలో ప్రజలను భాగస్వాములను చే యాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సు ష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌ యాదవ్‌, కమిషనర్‌ సాబేర్‌అలీ నాయకులు వెంకటేశ్‌, చంద్రారెడ్డి, శ్రీనివాస్‌, మోహన్‌రావు, దీప తదితరులు పాల్గొన్నారు. 

బడంగ్‌పేట:  ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని మే యర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి సూచించారు. కార్పొరేషన్‌ పరిధిలోని గుర్రంగూడ 7వ వార్డులో కార్పొరేటర్‌ గడ్డం లక్ష్మారెడ్డితో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌లో ఆరు లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కమిషనర్‌ సత్యబాబు, ఫారెస్ట్‌ అధికారులు శ్రావ్య, ఇంద్రసేనారెడ్డి, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, కా ర్పొరేటర్లు గడ్డం లక్ష్మారెడ్డి,  నాయకులు సాయి కిరణ్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సత్తిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో కమిషనర్‌ పెండ్యాల న ర్సింహ మొక్కలు నాటారు. కార్పొరేటర్లు నర్సింహ, భిక్షపతి, నాయకులు కరుణానిధి, గాజుల మధు, రఘు, నవీన్‌ కుమార్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

బండ్లగూడ: హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని మేయర్‌ మహేందర్‌గౌడ్‌ సూచించారు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆదర్శ కాలనీలో కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి  మొక్కలు నాటారు.

కందుకూరు: ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొ క్కలు నాటాలని కటికపల్లి సర్పంచ్‌ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. నాయకులు సాధ మల్లారెడ్డి, కళమ్మరాజు, జ్యోతి శేఖర్‌, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్‌: మండలంలోని  సుల్తాన్‌పల్లిలో  సర్పంచ్‌ దం డు ఇస్తారి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.