బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 07, 2020 , 23:42:35

ప్రతి మొక్కనూ కాపాడాలి: మంత్రి సబితారెడ్డి

ప్రతి మొక్కనూ కాపాడాలి: మంత్రి సబితారెడ్డి

తుక్కుగూడ : సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం తుక్కుగూడ మున్సిపల్‌ పరిధిలోని మంఖాల్‌ గేటు వద్ద ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారంలో తుక్కుగూడ నేతలు చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. ఇప్పటికే మున్సిపల్‌ పరిధిలో 10వేలకు పైగా మొక్కలు నాటారని కమిటీ సభ్యులను అభినందించారు. మున్సిపల్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌తో పాటు ఉద్యోగులను, సిబ్బందినంతా పనిలో పెట్టాలని అప్పుడు మరింత మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.    కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ మధుమోహన్‌, భవాని వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బూడిద తేజస్వినీశ్రీకాంత్‌గౌడ్‌, సప్పిడి లావణ్యరాజు, బాదావత్‌ రవినాయక్‌, రెడ్డిగళ్ల సుమన్‌, కొప్పుల పద్మశివయ్య, నాయకులు కె.నర్సింహారెడ్డి, బ్యాగరి సురేశ్‌, ఉప్పునూతల శ్రీనివాస్‌, ఎం.శేఖర్‌రెడ్డి, సామేల్‌ రాజు, ఎండీ బషీర్‌, నాజర్‌ఖాన్‌, బండ్ల మల్లేశ్‌, పద్మ, శ్రీలత, మీడియా సెల్‌ నాయకులు బుక్క శ్రీధర్‌ పాల్గొన్నారు.