మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Aug 28, 2020 , 23:31:07

సంక్షోభంలోనూ.. సంక్షేమానికే పెద్దపీట

సంక్షోభంలోనూ.. సంక్షేమానికే పెద్దపీట

ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ,వివేకానంద్‌, 

ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు

గాజులరామారం/హైదర్‌నగర్‌ : కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధి సోమయ్యనగర్‌లోని ఎంకేఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా మంజూరైన రూ.1.8 కోట్ల చెక్కులను 108 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, ధనిక తారతమ్యం లేకుండా సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన 

జగద్గిరిగుట్ట డివిజన్‌ కూన మహాలక్ష్మీనగర్‌, రింగ్‌బస్తీల్లో రూ.36.08 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజు, కార్పొరేటర్‌ కె.జగన్‌ పాల్గొని శంకుస్థాపన చేశారు. 

 కార్యక్రమంలో సూరారం కార్పొరేటర్‌ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్‌ జి.సురేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు జె.కె.శేఖర్‌యాదవ్‌, సయ్యద్‌ రశీద్‌, వేణుయాదవ్‌, సాయికుమార్‌ పంతులు, బాబుగౌడ్‌, శశిధర్‌, వార్డు కమిటీ సభ్యులు మహమూద్‌, ఇందిరాగౌడ్‌, పాపుల్‌గౌడ్‌, నాయకులు హాజ్రత్‌అలీ, ఎర్ర లక్ష్మయ్య, ఈ.వెంకటేశ్‌, దుర్గయ్య, గిరిబాబు  పాల్గొన్నారు. 

హైదర్‌నగర్‌ : పేదింట్లో పెండ్లి కాంతులు నింపుతూ పేద యువతుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా మంజూరైన 28 చెక్కులను ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌తో కలిసి విప్‌ గాంధీ శుక్రవారం తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వీఆర్‌వోలు యాదగిరి, వీఆర్‌ఏ ధన్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నార్నె శ్రీనివాస్‌రావు, లక్ష్మారెడ్డి, సంతోష్‌రావు, శ్రీను పాల్గొన్నారు.