శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Sep 21, 2020 , 00:54:12

ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు కృషి

ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు కృషి

ఉప్పల్‌ : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు కృషిచేస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రొళ్ల శ్రీనివాస్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కమిషన్‌ అండగా ఉంటుందన్నారు. ఉప్పల్‌ జైభీమ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే  ప్రపంచ మేధావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా  రింగ్‌రోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహానికి   ఎర్రొళ్ల శ్రీనివాస్‌    పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ బాధితులకు అండగా నిలిచి చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.  కార్యక్రమంలో మాస్టార్‌జీ, నల్ల బాబు, కేపీ శ్రీనివాస్‌, మస్క సుధాకర్‌, బాలనర్సింహ, గుండె రాజు, ఎర్ర బాలరాజు, వీరస్వామి, బాలపోచయ్య పాల్గొన్నారు.