ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 00:45:58

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

 బండ్లగూడ: సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సూచించారు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడిగా నియమితులైన ఎక్కల్‌దేవ్‌ మల్లేశ్‌యాదవ్‌కు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే  మంగళవారం ఎలక్ట్రానిక్‌ భగవద్గీతను బహూకరించారు. కార్యక్రమంలో గండిపేట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రామేశ్వరం నర్సింహ, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌, సంతోష్‌యాదవ్‌, వేణు, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.