శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 14, 2020 , 00:20:49

విద్యాభ్యాసం... డిజిటల్‌మయం

విద్యాభ్యాసం... డిజిటల్‌మయం

వీఎన్‌ఆర్‌వీజేఐఈటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో వక్తలు

దుండిగల్‌ : ప్రగతినగర్‌లోని విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల(వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ)లో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌పై (ఐసీఏసీఈసీఎస్‌) గురువారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు సాగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గురువారం ఇస్రో సంచాలకుడు రాజీవ్త్రన్‌ చేత్వాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా జేఎన్‌టీయూహెచ్‌ రెక్టార్‌, వైస్‌ చాన్స్‌లర్‌ గోవర్ధన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ రతన్‌ ప్రసంగించారు. ఇటీవల కాలంలో కంప్యూటర్‌ సైన్స్‌ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై చర్చించారు. జేఎన్‌టీయూహెచ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ కొవిడ్‌-19 సమయంలో విద్యాభ్యాసం పూర్తిగా డిజిటల్‌మయంగా మారిందన్నారు. కార్యక్రమంలో డెన్మార్క్‌ బిజినెస్‌ స్కూల్‌లోని సెంటర్‌ ఫర్‌ బిజినెస్‌ డేటా ఎనలిటిక్స్‌ సంచాలకుడు డాక్టర్‌ ముక్కామల రాఘవరావు, కేఐఐటీ డీమ్డ్‌ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ ఆచార్యుడు సురేశ్‌ చంద్ర, విజ్ఞానజ్యోతి అధ్యక్షుడు డాక్టర్‌ డీఎన్‌.రావు, కళాశాల ప్రధాన అధ్యాపకులతో పాటు 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం విద్యాసంస్థల పున:ప్రారంభానికి సంబంధించిన వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ రూపొందించిన ‘రీ స్టార్ట్‌ మాన్యువల్‌'ను ఆవిష్కరించారు.