గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 11, 2020 , 00:59:38

ఇంటివద్దనే విద్య

ఇంటివద్దనే విద్య

శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీసాట్‌ యాప్‌

అంగన్‌వాడీ చిన్నారులకు ఆన్‌లైన్‌ ద్వారా బోధన

కందుకూరు: అంగన్‌వాడీ విద్యార్థులకు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  టీసాట్‌ వి ద్యా యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా చిన్నారులు స్మార్ట్‌ఫోన్‌, కేబుల్‌ చానల్‌ ద్వారా పాఠాలు వింటున్నారు. కరోనా నేపథ్యంలో పిల్లలు ఇంట్లోనే ఉంటూ పూర్వ ప్రాథమిక విద్యను నేర్చుకుంటున్నారు. కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్‌ మండలాల పరిధిలోని 237 అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులు ఈ యాప్‌ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు పొడుపు కథలు, బొమ్మలు,  కథల వీడియోలతో పాటు  మానసికోల్లాసానికి సంబంధించిన కార్యక్రమాలు  ప్రసారం చేస్తున్నారు.  ప్రతి అంగన్‌వాడీ టీచర్‌ స్మార్ట్‌ ఫోన్లతో ఆన్‌లైన్‌ ద్వారా బోధన చేస్తున్నారు. అదే విధంగా  గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని  సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. 

ఇంటింటికీ పౌష్టికాహారం 

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పౌష్టికాహారం గుడ్లు, పాలు అందజేస్తున్నాం.  తల్లి దండ్రులు ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని పిల్లలకు ఇంటి వద్దనే ఆన్‌లైన్‌లో పాఠాలు వినిపిస్తున్నారు.

-యశోద,  అంగన్‌వాడీ టీచర్‌, నేదునూరు

పొడుపు కథలు ప్రసారం

కరోనా నేపథ్యంలో చిన్నారులకు ఆన్‌లైన్‌ ద్వారా విద్యాబోధన కోసం టీసాట్‌ యాప్‌ను ప్రవేశపెట్టాం. ఈ యాప్‌ ద్వారా పొడుపు కథలు, బొమ్మలు,  పలు కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. చిన్నారుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.

-షబానా, సీడీపీవో, మహేశ్వరం ప్రాజెక్ట్‌