గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 23:39:14

నిండుకుండలా దుండిగల్‌ పెద్దచెరువు

 నిండుకుండలా దుండిగల్‌ పెద్దచెరువు

 దుండిగల్‌, ఆగస్టు16: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగరశివారు ప్రాంతంలోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. భారీగా వరదనీరు చెరువులోకి వచ్చి చేరుతుండటంతో నిండుకుండలా దర్శణమిస్తున్నాయి. ప్రధానంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో నాలుగురోజులుగా వర్షం కురుస్తుండటంతో చెరువుల్లోకి వరదనీరు వచ్చిచేరుతున్నది. దీంతో దుండిగల్‌లోని పెద్ద చెరువు నిండుకుండలా కనువిందు చేస్తున్నది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.