సోమవారం 26 అక్టోబర్ 2020
Rangareddy - Aug 05, 2020 , 23:14:22

మూగబోయిన ‘పల్లవి’

మూగబోయిన ‘పల్లవి’

కుర్చీలో ఆడుకుంటూ కిందపడిన చిన్నారి

చికిత్స పొందుతూ కన్నుమూత 

ఆ ఇంట ఆడపిల్ల పుట్టిందన్న సంతోషం ఏడాదైనా నిలువలేదు. అప్పటిదాకా బోసి నవ్వులతో సందడి చేసిన చిన్నారి ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఉత్సాహంగా ఆడుకుంటున్న పసిపాప.. కుర్చీలోంచి కింద పడిపోవడంతో నిత్యం సందడిగా ఉండే ఆ ఇంట్లోని ‘పల్లవి’ మూగబోయింది.

దుండిగల్‌: దుండిగల్‌ మండలంలోని గండిమైసమ్మ కాలనీకి చెందిన రమావత్‌ రాజేందర్‌ సునీతలు దంపతులు. వీరికి ఏడాది వయస్సున్న పల్లవి అనే కూతురు ఉంది. గతనెల 28న పాప కుర్చీలో ఆడుకుంటుండగా.. తల్లి సునీత ఇంటి బయటకు వెళ్లింది. అదే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయిన పల్లవి తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన పాపను ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. దీంతో చిన్నారి బోసినవ్వులు విరబూయాల్సిన ఆ ఆంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


logo