మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 23:59:49

నిరుపేదలకు ‘డబుల్‌' భరోసా

నిరుపేదలకు ‘డబుల్‌' భరోసా

  బెడ్రూంలు ఇంద్రారెడ్డినగర్‌ కాలనీవాసులకే 

  పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

బండ్లగూడ, ఆగస్టు 20: నిరుపేదల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతామని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తా వద్ద ఉన్న ఇంద్రారెడ్డినగర్‌లో డబుల్‌ బెడ్రూంలు నిర్మించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. కాగా అధికారులు ఎమ్మెల్యేతో కలిసి ఇంద్రారెడ్డినగర్‌ కాలనీవాసులతో గతంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డబుల్‌ ఇండ్ల నిర్మాణం కోసం కాలనీవాసులు ఇండ్లను ఖాళీ చేయాలని అధికారులు కోరారు. ఇందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇంద్రారెడ్డి నగర్‌ కాలనీవాసులకు డబుల్‌ ఇండ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వారికి గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పొసెషన్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో వారిని ఇండ్లను ఖాళీ చేసి ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, కార్పొరేటర్‌ కోరని శ్రీలతమహాత్మా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.