గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 26, 2020 , 00:18:28

అనాథ విద్యార్థులకు వెబ్‌కెమెరాలు అందజేత

అనాథ విద్యార్థులకు వెబ్‌కెమెరాలు అందజేత

ఆర్కేపురం:  విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని ఆశాజ్యోతి స్వచ్ఛంద సంస్థ సభ్యుడు నందుకుమార్‌ తెలిపారు. శనివారం ఆర్కేపురం డివిజన్‌ చిత్రలే అవుట్‌ కాలనీలోని అనాథ గృహ విద్యార్థులకు రూ. 1.6 లక్షల విలువ చేసే 40 వెబ్‌ కెమెరాలు, హెడ్‌సెట్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశాజ్యోతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనాథ, నిరుపేద విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నందున వెబ్‌ కెమెరాలు, హెడ్‌సెట్లను అందజేశామన్నారు. దాతల సహాయంతో అందిస్తున్న వస్తువులను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. అనాథ ఆశ్రమ నిర్వాహకులు రాజేశ్‌, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.