బుధవారం 05 ఆగస్టు 2020
Rangareddy - Aug 01, 2020 , 00:27:37

శానిటేషన్‌ కిట్లు పంపిణీ

శానిటేషన్‌ కిట్లు పంపిణీ

బండ్లగూడ:  పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల  జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే తన నివాసంలో పారిశుద్ధ్య సిబ్బందికి శానిటేషన్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ కిట్లలో వారికి సంబంధించిన ఏకరూప దుస్తులతో పాటు షూ వంటి వస్తువులు ఉంటాయన్నారు. సిబ్బంది వాటిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.logo