మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 21, 2020 , 00:39:27

తెల్లబండ జలపాతం వద్ద అపశృతి

తెల్లబండ జలపాతం వద్ద అపశృతి

చూడడానికి వెళ్లి.. జారిపడిన నగర విద్యార్థి

దవాఖానకు తరలిస్తుండగా మృతి 

నీటి ఉధృతి అధికంగా ఉందని 

అధికారులు చెబుతున్నా వినని పర్యాటకులు

మంచాల : రంగారెడ్డి జిల్లా, మంచాల మండ లం, బోడకొండ జలపాతం  సమీపంలోని మరో జలపాతం వద్ద ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిన  నగరానికి చెందిన ఓ విద్యార్థి  మృతిచెందాడు. మంచాల సీఐ వెంకటేశ్‌గౌడ్‌ కథనం ప్రకారం.. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బోడకొండ-చెన్నారెడ్డిగూడ జలపాతం తీవ్ర ఉధృతితో ప్రవహిస్తున్నది. దీంతో రెండు రోజుల నుంచి పర్యాటకులు సందర్శించవద్దని అధికారులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా ప్రజలు వస్తూనే ఉన్నారు. దీంతో ఇక్కడకు పర్యాటకులు రావడాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే, బోడకొండ సమీపంలోని మరో జలపాతం తెల్లబండ వద్దకు నగరంలోని అత్తాపూర్‌కు చెందిన 11మంది విద్యార్థులు కొండపైకి వెళ్లి నీటిలో సరదాగా గడుపుతున్నారు.  అందు లో ఈశ్వర్‌సింగ్‌(16)  నీటి ఉధృతికి అదుపుతప్పి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఈశ్వర్‌సింగ్‌ను అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అయితే ఈశ్వర్‌సింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బోడకొండ నుంచి ఎల్లమ్మతండా వరకు రోడ్డుకిరువైపులా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.