బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 22, 2020 , 00:08:27

అరగంటలో నిర్ధారణ

అరగంటలో నిర్ధారణ

పీహెచ్‌సీల్లో యాంటిజెన్‌ టెస్టులు

పాజిటివ్‌ వస్తే హోం ఐసొలేషన్‌కు తరలింపు

జాగ్రత్తలు పాటించాలంటున్న  వైద్యులు

మణికొండ:  రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ర్యాపిడ్‌ (యాంటిజెన్‌) టె స్టులకు అనుమతిచ్చింది. దీంతో అన్ని పీహెచ్‌సీ కేంద్రాల్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు.  అరగంటలో నెగెటివా పాజిటివా అని నిర్ధారిస్తున్నారు. రాజేంద్రనగర్‌ ని యోజకవర్గ పరిధిలోని శంషాబాద్‌, నార్సింగి, రాజేంద్రనగర్‌ పీహెచ్‌సీ  కేంద్రాల్లో  ఈ నెల 8 నుంచి ఉచితంగా టెస్టులు   చేస్తున్నారు. ముక్కు నుంచి నమూనాలను సేకరించి యాంటిజెన్‌ కిట్ల ద్వారా పరీక్షిస్తున్నారు.  మూడు పీహెచ్‌సీ కేంద్రాల్లో మొదటి రోజు 205 మందిని పరీక్షించగా 22 మందికి పాజిటివ్‌ అని తేలింది. అదే విధంగా నార్సింగి పీహెచ్‌సీ కేంద్రంలో మొదటి మూడు రోజుల్లో  297 మందిని పరీక్షించగా 65 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. జ్వరం, దగ్గు, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటే కరోనా అనే అనుమానంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారు పీహెచ్‌సీ కేంద్రాలకు వెళ్లి ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకుని ర్యాపిడ్‌ టెస్టులను చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పాజిటివ్‌ అని నిర్ధారణ అయితే హోం ఐసొలేషన్‌లో ఉండాలని పేర్కొంటున్నారు.  

అత్యవసరమైతేనే బయటకు రావాలి

కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ర్యాపిడ్‌ (యాంటిజెన్‌) టెస్టులకు శ్రీకారం చుట్టింది. అరగంటలోనే ఫలితం చెబుతున్నాం. సీజనల్‌ వ్యాధులు సోకిన చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. నార్సింగి పీహెచ్‌సీ కేంద్రంలో  ప్రతి రోజూ పరీక్షలు చేస్తున్నాం. చాలా మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులను ధరించాలి.  అత్యవసరమైతేనే బయటకు రావాలి. 

   -శ్రీనివాస్‌. వైద్యాధికారి, నార్సింగి పీహెచ్‌సీ