గురువారం 29 అక్టోబర్ 2020
Rangareddy - Sep 21, 2020 , 00:58:55

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

కలెక్టర్‌ పౌసుమిబసు

బొంపల్లి తండాలో జొన్న పంట పరిశీలన 

దాదాపూర్‌ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటిన కలెక్టర్‌

దోమ : అక్టోబర్‌ మొదటి వారంలోగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. ఆదివారం దోమ, దాదాపూర్‌, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్‌ మొదటి వారంలోగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను అందుబాటులోకి తీసుకురావాలని దోమ సర్పంచ్‌ రాజిరెడ్డి, దాదాపూర్‌ సర్పంచ్‌ కృష్ణ, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ లక్ష్మయ్యముదిరాజ్‌ను కోరారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించేలా చూడాలని పంచాయతీరాజ్‌ ఏఈ మణికుమార్‌ను ఆదేశించారు. దోమ పెద్ద చెరువు తూములో లీకేజీ అవుతుందని సంబందిత శాఖ అధికారులకు వివరించినా స్పందించడం లేదని రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ లక్ష్మయ్య, సర్పంచ్‌ రాజిరెడ్డి కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం ఆమె దాదాపూర్‌ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి అక్కడ మొక్కలు నాటారు. మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలతో పంట పొలాల్లో పంటల పరిస్థితిని తెలుసుకునేందుకు ఆమె బొంపల్లి తండాలో వెంకటనాయక్‌ పంటపొలంలో ఉన్న జొన్న పంటను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌, తాసిల్దార్‌ శైలేంద్రకుమార్‌, పంచాయతీ కార్యదర్శులు మొగులయ్య, రవీందర్‌రెడ్డి ఉన్నారు.logo