బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 17, 2020 , 01:43:06

దంచికొట్టిన వాన..

దంచికొట్టిన వాన..

ఉమ్మడి జిల్లా  వ్యాప్తంగా భారీ వర్షం

రంగారెడ్డి జిల్లాలో 12.5 మీ.మీ వర్షపాతం నమోదు

పంట పొల్లాలోకి చేరిన వర్షపు నీరు

 రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో వాన మరోమరు దంచికొట్టింది. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వ ర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా వర్షం పడుతున్నప్పటికీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 12.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 27 మండలాల్లో గడిచిన 24 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది.  25 మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదుకాగా..మరికొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో  వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 60 చెరువులకు పైగా మత్తడి దుంకుతున్నాయి. 2033 చెరువులకు జలకళ సంతరించుకుంది. షాబాద్‌ మీదుగా ప్రవహించే ఈసీ-శంకర్‌పల్లి మీ దుగా ప్రవహించే మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  గండిపేటలో 109 మి.మీ, అత్తాపూర్‌లో 104.3 మి.మీ, రాజేంద్రనగర్‌లో 90.8 మి.మీ, అబ్దూల్లాపూర్‌మెట్‌ మండలం తొర్రూర్‌లో 88.5 మి.మీ, ఖాజాగూడలో 80.3 మి.మీ మొయినాబాద్‌ మండలం చిల్కూరు మృగవని వద్ద 99 మి.మీ, మణికొండలో 97.8 మి.మీ చొప్పు న వర్షపాతం నమోదైంది. 

 14 ఏండ్ల తరువాత పోల్కంపల్లి చెరువుకు జలకళ

 ఇబ్రహీంపట్నంరూరల్‌ : నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలు వరణుడు మొహం చాటేయడంతో చెరువులు, కుంట లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో రైతులు కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలో భారీ వర్షాలు కురువడంతో 14 సంవత్సరాల క్రితం ఎండిపోయిన చెరువులకు జలకళ సంతరించుకుం ది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేయడం తో పాటు మత్స్యకారులు పెద్ద ఎత్తున చెరువులు, కుంట లు, వాగుల్లో చేపపిల్లలను వదులుతున్నారు.14 సంవత్సరాల క్రితం ఎండిపోయిన పోల్కంపల్లి చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు 70శాతం వరకు నీటితో నిండంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఆయకట్టు కింద పంటలు సాగుచేసుకునే రైతుల బోరు మోటర్లకు కూడా నీరందిస్తుండటంతో రైతులు ఆనందంలో ఉన్నారు. వర్షపు నీటితో నిండిన చెరువు పరిస్థితిని బుధవారం సర్పంచ్‌ చెరుకూరి ఆండాళు పరిశీలించారు. చెరువుకు ఎక్కడైనా గండి పడిందా, నీటి లీకేజీలు ఏర్పడుతున్నాయా అని పరిశీలించినట్లు తెలిపారు. 

      వికారాబాద్‌ జిల్లా అంతటా భారీ వర్షం

వికారాబాద్‌ జిల్లా అంతటా బుధవారం సాయంత్రం నుం చి రాత్రి వరకు సుమారు 4 గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొం గిపొర్లాయి. మూసీనదితోపాటు కోట్‌పల్లి, ఎబ్బనూరు, మాలసోమారం, మాన్‌సాన్‌పల్లి వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. భారీ వరదతో ధారూర్‌ మండలంలోని మాలసోమారం, బషీరాబాద్‌ మండలంలోని నాలుగైదు గ్రామాల్లోని ఇండ్లలోకి వర్షపు నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు మన్‌సాన్‌పల్లి వద్ద వేసిన తాత్కాలిక రోడ్డు కోట్టుకుపోవడంతో తాండూర్‌-వికారాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. మరోవైపు బషీరాబాద్‌, తాండూర్‌ తదితర మండలాల్లో వర్షాలకు 10 ఇండ్లు నేలకూలాయి. 

 బషీరాబాద్‌: మండలంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు కురిసిన వర్షానికి పంటపొలాల్లోకి వర్షపు నీరు చేరింది, పలు గ్రామాల్లో ఇండ్లు కూలా యి. వాగులు, వంకలు పారడంతో పాటు, అన్ని చెరువులు నిండుకుండలా మారాయి. 49మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కొర్విచేడ్‌, మంతట్టి, నవా ల్గా, మాసన్‌పల్లి, తదితర గ్రామాల్లోని పంటపొలాల్లో వర్ష పు నీరు చేరింది. పత్తి, కంది పంటలు వర్షపు నీటిలో తేలాయి. కాగా కొర్విచేడ్‌, కంసాన్‌పల్లి (ఎం), హక్యానాయక్‌తండా,కొత్లాపూర్‌, అల్లాపూర్‌ గ్రామాల్లో ఇండ్లు కూలాయి.

వర్షంతో రకుల్‌ షూటింగ్‌కు అంతరాయం

వికారాబాద్‌ : జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురియడంతో అనంతగిరి అడవుల్లో జరుగుతున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సినిమా షూటింగ్‌ నిలిచిపోయిం ది. నాలుగు రోజులుగా వికారాబాద్‌లో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా షూటింగ్‌ కొనసాగుతున్నది. అ నంతగిరి కొండల్లో చిత్ర యూనిట్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ నడుస్తున్న సమయంలోనే భారీ వ ర్షం కురియడంతో కొండపై నుంచి వారు ఉన్న ప్రాంతాని కి వరద రావడంతో షూటింగ్‌ ఆపేశారు. వాహనాలు బురదలో ఇరుక్కుపోవడంతో చిత్ర యూనిట్‌తో సహా రకుల్‌  రెండు గంటలు వర్షంలోనే చిక్కుకున్నారు. అనంతరం వేరే వాహనాల సహాయంతో అక్కడి నుంచి బయలుదేరారు.