ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 30, 2020 , 06:22:31

హేమంత్‌ హత్య కేసు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు పంపాలని ప్రభుత్వానికి సీపీ సజ్జనార్‌ లేఖ

హేమంత్‌ హత్య కేసు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు పంపాలని ప్రభుత్వానికి సీపీ సజ్జనార్‌ లేఖ

హేమంత్‌ హత్య కేసు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ

అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ 

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హేమంత్‌ హత్య కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేవని, ఇందు లో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌ చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్‌ చేశాం, ఇంకా కొందరి పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది... వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి యుగంధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలను కోర్టు అనుమతితో ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇలా.. మిగతా నిందితులను కూడా దశల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు. ఈ కేసు విచారణలో నిందితులు ఎవరు కూడా తప్పించుకోకుండా నమోదు చేసిన అభియోగాలను పూర్తి ఆధారాలతో నిరూపిస్తామని సీపీ చెప్పారు. పోలీసుల స్పందనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సీపీ పేర్కొన్నారు.