ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 02, 2020 , 00:14:21

కరోనా వారియర్స్‌ సేవలు అమోఘం

కరోనా వారియర్స్‌ సేవలు అమోఘం

ఆర్కేపురం: కొవిడ్‌ సమయంలో కరోనా వారియర్స్‌ సేవలు అమోఘమని ప్రముఖ నటి ప్రణీత అన్నారు. గూగీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 3వ వార్షికోత్సవాన్ని మంగళవారం కొత్తపేటలోని మినర్వా హోటల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా నటి ప్రణీత, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన డాక్టర్స్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రణీత మాట్లాడు.. రియల్‌ రంగంలో గూగీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రారాజుగా ఎదుగుతుందన్నారు. సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ షేక్‌ అక్బర్‌, డైరెక్టర్‌ గంగుల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులకు రక్షణగా హెల్మెట్లు, నిత్యావసరాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూగీ సంస్థ ప్రతినిధులు కిషన్‌, నయీం, మహ్మద్‌, ఎ.ఎన్‌.రెడ్డి, కార్పొరేటర్‌ విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.