శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Aug 26, 2020 , 00:16:16

‘గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తా’

‘గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తా’

హైదర్‌నగర్‌, ఆగస్టు 25 : గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తానని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి, కార్యదర్శి మనోజ్‌కుమార్‌ విప్‌ గాంధీని మంగళవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రంథాలయాలకు స్థలాలు, పక్కా భవనాలపై విప్‌తో చర్చించారు. ప్రజాసౌకర్యం కోసం గ్రంథాలయాలను ఆధునీకరించి, డిజిటల్‌ సేవలతో నవీకరించనున్నట్లు పాండురంగారెడ్డి తెలిపారు.