బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 24, 2020 , 01:13:10

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

ఎమ్మెల్యే  ప్రకాశ్‌గౌడ్‌

 బండ్లగూడ :  రాజేంద్రనగర్‌ నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యమని, పార్టీలకతీతంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు డివిజన్‌లలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్‌ మహేందర్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లతో కలసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఇప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.  రాజేంద్రనగర్‌లో త్వరలో  డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేటర్లు రాము, అస్లాంబిన్‌ అబ్దుల్లా, సాగర్‌గౌడ్‌, భూపాల్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్‌, కోఆప్షన్‌ సభ్యులు మాలాకీరత్నం, నాయకులు డాక్టర్‌ నవాబ్‌ ముంతాజ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, పాపయ్యయాదవ్‌, రాజు, ఇనాయత్‌ తదితరులు పాల్గొన్నారు.