శుక్రవారం 23 అక్టోబర్ 2020
Rangareddy - Sep 21, 2020 , 00:51:26

నిధుల దుర్వినియోగంపై మంత్రికి ఫిర్యాదు

నిధుల దుర్వినియోగంపై మంత్రికి ఫిర్యాదు

కందుకూరు: మండల పరిధిలోని దాసర్లపల్లి సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులపై మంత్రి సబితాఇంద్రారెడ్డికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు జయేందర్‌ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్‌ జయమ్మ ఆదివారం మంత్రి నివాసానికి వెళ్లి సర్పంచ్‌ బాలమణి, ఉప సర్పంచ్‌ మంగదేవితో పాటు పంచాయతీ కార్యదర్శులు అవకతవకలకు పాల్పడినట్లు తెలిపారు. 30రోజుల ప్రణాళికలో పలువురి పేర్లను ఫోర్జరీ చేసి నిధులు డ్రా చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా జేసీబీ బిల్లు రూ.84వేలను మాత్రమే చెల్లించారని ఆ ఓచర్‌ను ఫోర్టరీ చేశారని తెలిపారు. అవకతవకలకు పాల్పడిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వార్డు మెంబరు అనిత, మహేందర్‌, యాదయ్య, రాములు, అంజయ్య, శేఖర్‌గౌడ్‌, కళమ్మ, లక్ష్మమ్మ, మైసమ్మ, చెన్నమ్మ పాల్గొన్నారు.


logo