మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Sep 06, 2020 , 00:37:56

నష్టపరిహారం నిధులు విడుదల చేయాలి

నష్టపరిహారం నిధులు విడుదల చేయాలి

ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకవర్గంలో డీ-82 ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు వెంటనే నష్టపరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ బీఆర్‌కే భవన్‌లో ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవలనే కల్వకుర్తి నియోజకవర్గంలో అసంపూర్తి పనుల పూర్తి కోసం సీఎం కేసీఆర్‌ నిధుల మంజూరు కోసం హామీనిచ్చినట్లు గుర్తు చేశారు. దీనికి రజిత్‌కుమార్‌ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వెల్దం డ జడ్పీటీసీ విజితారెడ్డి పాల్గొన్నారు.