గురువారం 01 అక్టోబర్ 2020
Rangareddy - Aug 11, 2020 , 00:12:05

కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ఏకగ్రీవం

కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ఏకగ్రీవం

 ధ్రువీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ 

శంషాబాద్‌: పాలనా వ్యవహారంలో కోఆప్షన్‌ సభ్యులు సహకరించాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం శంషాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరిగింది. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు చేవెళ్ల కవితాప్రసాద్‌, జి.పి.సంతోషం ప్రభాకర్‌, దోసపాటి రాజేంద్రప్రసాద్‌, అస్లం ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. అనంతరం శంషాబాద్‌ మున్సిపల్‌ నూతన కోఆప్షన్‌ సభ్యులు నలుగురికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సుష్మారెడ్డి, వైస్‌చైర్మన్‌ బండి గోపాల్‌యాదవ్‌, కమిషనర్‌ సాబేర్‌ అలీ, శంషాబాద్‌ మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు డి.వెంకటేశ్‌, మాజీ సొసైటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, నీరటి రాజు, మాజీ సర్పంచ్‌ గణేశ్‌, శ్రీనివాస్‌, మోహనరావు, జీపీ ప్రభాకర్‌, ప్రసాద్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 


logo