ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 05, 2020 , 00:29:12

కో-ఆప్షన్‌ ఎన్నికలు ప్రశాంతం

కో-ఆప్షన్‌ ఎన్నికలు ప్రశాంతం

 టీఆర్‌ఎస్‌-3, బీజేపీ-3, కాంగ్రెస్‌-2 చొప్పున సభ్యుల ఎన్నిక

మణికొండ, ఆగస్టు 4 : రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలోని మణికొండ, నార్సింగి మున్సిపాటీల్లో మంగళవారం జరిగిన కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నార్సింగి మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ హాజరై కౌన్సిల్‌ సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ బలపర్చిన సభ్యులకు తమ మద్దతు తెలిపారు. 

నార్సింగి మున్సిపాలిటీ కౌన్సిల్‌ మైనార్టీ రిజర్వేషన్‌ కోటా ద్వారా సయ్యద్‌ మహమూద్‌-(టీఆర్‌ఎస్‌), రషీదాబేగం-(టీఆర్‌ఎస్‌)లు పార్టీ తరఫున ఎన్నికయ్యారు. జనరల్‌ రిజర్వేషన్‌ కోటాలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన ప్రశాంత్‌యాదవ్‌-(టీఆర్‌ఎస్‌), బీజేపీ బలపర్చిన మహిళా సభ్యురాలిగా కలమ్మ-(బీజేపీ) కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖ, వైస్‌చైర్మన్‌ వెంకటేశ్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మణికొండ మున్సిపాలిటీలో ..

కమిషనర్‌ జయంత్‌ అధ్యక్షతన నిర్వహించిన మణికొండ మున్సిపాలిటీ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీలు సంయుక్తంగా బలపర్చిన మైనార్టీ రిజర్వేషన్‌ కోటాలో అజీమున్నీసా బేగం- 

(కాంగ్రెస్‌), ముకర్రం షా-(కాంగ్రెస్‌), జనరల్‌ కోటాలో సిద్ధప్ప-(బీజేపీ), లక్ష్మి-(బీజేపీ)లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, కమిషనర్‌, మేనేజర్‌ పవన్‌కుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo