గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 01, 2020 , 23:46:50

మోడల్‌ గ్రంథాలయాల నిర్మాణం సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మోడల్‌ గ్రంథాలయాల నిర్మాణం సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

బడంగ్‌పేటలో రూ.4కోట్లతో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన 

గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం : ఎంపీ రంజిత్‌రెడ్డి 

పుస్తక పఠనంతో విజ్ఞానం : జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి

బడంగ్‌పేట : అర్బన్‌ ప్రాంతాల్లో మోడల్‌ గ్రంథాలయాలు నిర్మించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి దావుద్‌ఖాన్‌గూడలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఎస్‌ఈ డబ్ల్యూ ఐడీసీ జి. నాగేందర్‌గౌడ్‌,  కేంద్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కప్పాటి పాండు రంగారెడ్డిలతో కలిసి నూతన గ్రంథాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన మోడల్‌ గ్రంథాలయం తరహాలో బడంగ్‌పేటలోనూ అదే మాదిరిగా నిర్మించనున్నామని,  రూ.4కోట్లతో భవన నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సీఎం సూచన, ప్రజాభిప్రాయం మేరకు ఈ భవనం సీనియర్‌ సిటిజన్స్‌, విద్యార్థులు, మహిళలు, పిల్లలకు అనుకూలంగా ఉండనున్నదని తెలిపారు. శంషాబాద్‌, చేవెళ్ల, శేరిలింగంపల్లిలో మోడల్‌ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని, వీటివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. పుసక్త పఠనంతో విజ్ఞానం ఒరవడుతుందన్నారు. పీవీ నరసింహారావు లాంటి వారు గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు చదివి బహుభాష కోవిధులయ్యారని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో నూతన గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కమిషనర్‌ సత్యబాబు, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.

రూ.19కోట్లతో 83 రైతు వేదికలు

మహేశ్వరం : రంగారెడ్డి జిల్లాలో రూ.19 కోట్లతో 83 రైతు వేదికలను నిర్మించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో రూ.22లక్షల నిధులతో నిర్మించనున్న రైతు వేదిక భవనం పనులకు జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితా హరిత్‌రెడ్డి, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో కలిసి బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. 550 కోట్లతో 2500ల  రైతు వేదికలను నిర్మించనున్నట్లు తెలిపారు. మహేశ్వరం మండలంలోని నాగారం, దుబ్బచర్లలో రైతు వేదికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతిక్‌జైన్‌, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునితా అంద్యానాయక్‌, ఎంపీడీవో నర్సింహులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురసాని సురేందర్‌రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, సమన్వయ సమితి సభ్యులు కూన యాదయ్య, డీఏవో గీతారెడ్డి, ఏడీఏ సుజాత, మండల వ్యవసాయాధికారి కోటేశ్వర్‌రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్‌ అశోక్‌, నాయకులు చంద్రయ్య ముదిరాజ్‌, దోమ శ్రీనివాస్‌రెడ్డి, చందు ముదిరాజ్‌, శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.