సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Sep 28, 2020 , 01:04:08

సీఎం సహాయనిధి పేదలకు వరం

సీఎం సహాయనిధి పేదలకు వరం

ఇబ్రహీంపట్నంరూరల్‌ : సీఎం సహాయనిధి పథకంతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముకునూరు గ్రామానికి చెందిన పాశం యాదయ్య ఆరునెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడగా దవాఖానలో రూ.యాభైవేల వరకు ఖర్చు అయ్యింది. సర్పంచ్‌ శివరాల జ్యోతిరాజు కృషితో ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి రూ.28వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి సహాయనిధి పథకంతో పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జ్యోతిరాజు, గ్రామస్తులున్నారు.