శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jul 18, 2020 , 00:02:05

వరద నీటి సమస్యకు చెక్‌

వరద నీటి సమస్యకు చెక్‌

వేగంగా సాగుతున్న పనులు

రూ. 43 లక్షలు నిధులు మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఆర్కేపురం:  తెలంగాణ ప్రభుత్వం కాలనీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. దానిలో భాగంగా ఆర్కేపురం డివిజన్‌ హరిపురి కాలనీ రోడ్డు నంబర్‌ 3 లో 20 ఏండ్లుగా నెలకొని ఉన్న వరద నీటి సమస్యను పరిష్కరించారు. చిన్నపాటి వర్షం పడినా నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు ఇ బ్బందులు పడేవారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. ప్రతి ఏడాది వరద నీటి సమస్య ఎదురవుతున్నా అధికారులు పనులు చేపట్టడం లేదని కాలనీ వాసులు ఎన్నోసార్లు  మొరపెట్టుకున్నారు. డివిజన్‌లో ఎ త్తు ప్రాంతాలైన వాస్తు కాలనీ, ఎన్టీఆర్‌నగర్‌, కృష్ణానగర్‌, సరోజినీనగర్‌, జనప్రియ కాలనీ గుండా వరదనీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తూ హరిపురికాలనీ వీధుల నుంచి అల్కాపురి చౌరస్తా తూములో కలిసి నాగోలు మూసీవైపు వెళ్లాలి.  కానీ హరిపురి కాలనీకి వచ్చే సరికి నీరు వెళ్లే మార్గం సరిగ్గా లేకపోవడంతో వరద నీరంతా ఇండ్లలోకి వచ్చేది. కాగా ఇటీవల కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు  సమస్యను మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి  రూ.43 లక్షల నిధులను మంజూరు చేయించారు. కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి  ఇటీవల పనులను ప్రారంభించారు. దీంతో కాలనీ వాసులు హర్షం  వ్యక్తం చేస్తున్నారు.

మంత్రికి కృతజ్ఞతలు

ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న వరద నీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎత్తు ప్రాంతాల నుం చి వరదనీరు ప్రవహిస్తూ మా కాలనీలో ఆగిపోయేవి. విషయాన్ని మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. పనులు ప్రారంభమయ్యాయి. 

-వెంకటేశం గుప్తా , కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు 

సంతోషంగా ఉంది

వర్షం పడిన ప్రతిసారి కాలనీలో మో కాల్లోతు నీళ్లు నిల్చేవి. వరద నీటితో చా లా ఇబ్బందులు పడ్డాం. పనులు ప్రారంభం కావడంతో సంతోషంగా ఉంది. కాలనీలో రోడ్లు కూడా అధ్వానంగా ఉ న్నాయి. వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి.

- కృష్ణమూర్తి,కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి