మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Sep 27, 2020 , 01:27:10

చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం కృషి చేయాలి

చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం కృషి చేయాలి

 చర్లపల్లి : చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రజక రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి సందర్భంగా ఈసీఐఎల్‌ చౌరస్తాలోని ఆమె విగ్రహనికి కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బేతాల బాల్‌రాజు, కార్యదర్శి సురేందర్‌రావు, నాయకులు జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, మణిపాల్‌రెడ్డి, కాసం మహిపాల్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బొడిగె రాజుగౌడ్‌, గోవర్ధన్‌, శోభారాణి, తెలంగాణ రాష్ట్ర రజక సమితి గౌరవ అధ్యక్షుడు శనిగరం ఆశోక్‌, అధ్యక్షుడు కుమార్‌స్వామి, ముంజంపల్లి రాములు, వెంకటేశ్‌, కరుణకర్‌, రవి, శేఖర్‌, బాలయ్య ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రజక సమితి నాయకులు పాల్గొన్నారు. 

ఐలమ్మ ధీరత్వాన్ని అందిపుచ్చుకోవాలి

 వనస్థలిపురం : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ధీరత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం చింతలకుంటలోని ఐలమ్మ విగ్రహం వద్ద జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఐలమ్మ ఐక్యవేదిక బాతరాజు నర్సింహ, కార్యదర్శి చంద్రయ్య, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

నాగోల్‌ డివిజన్‌ పరిధిలో...

 మన్సూరాబాద్‌ : చాకలి ఐలమ్మ జయంతికి రజక చైతన్య సంఘం అధ్యక్షుడు పెద్దవూరె బ్రహ్మయ్య హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో పగడాల ఉమాపతి, రమేశ్‌, కిషన్‌, మహేశ్‌, శ్రీను, నారాయణ, ప్రసాద్‌, ఆదినారాయణ, వెంకటయ్య పాల్గొన్నారు.