శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 21, 2020 , 00:01:17

నిబంధనల మేరకే ఉత్సవాలు

నిబంధనల మేరకే ఉత్సవాలు

బండ్లగూడ, ఆగస్టు 20: వినాయక ఉత్సవాలను ప్రభుత్వ నిబంధనల మేరకు నిరాడంబరంగా నిర్వహించుకోవాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజేంద్రనగర్‌ సర్కిల్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ విగ్రహాలు పెట్టకుండా సౌండ్‌ సిస్టమ్‌, డీజేలు, ర్యాలీలు చేయరాదని సూచించారు. నివాసాల్లో ప్రతిమలను పెట్టి పూజలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ శ్రీలత, కమిటీ సభ్యులు మల్లారెడ్డి, కొమురయ్య, రామేశ్వరరావు, ప్రేమ్‌గౌడ్‌, ధర్మారెడ్డి, రఘుయాదవ్‌, రవి, ఇంద్రపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మట్టి వినాయకుల పంపిణీ

బండ్లగూడ: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను వాడాలని అత్తాపూర్‌ కార్పొరేటర్‌ రావుల విజయజంగయ్య పేర్కొన్నారు. గురువారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బంగి శ్రీనివాస్‌, బోయ రమేశ్‌, మల్లేశ్‌, నగేశ్‌, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలి

శంషాబాద్‌: కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితిని ఇండ్లలోనే జరుపుకోవాలని శంషాబాద్‌ ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్‌ తెలిపారు.