కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో శనివారం మోడల్ స్కూల్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. మోడల్ స్కూల్లో 174మంది 6నుంచి 10వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోగా అందులో 137మంది విద్యార్థులు పరీక్షలు హాజరైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తెలిపారు. మోడల్ స్కూల్లో 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశానికి ఈ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కులను బట్టి విద్యార్థులకు మోడల్ స్కూల్లో సీటు కేటాయింపు రిజర్వేషన్ ప్రకారం జరుగుతుందని అన్నారు.