శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 21, 2020 , 00:08:40

ఇన్నర్‌ రింగ్‌రోడ్డుపై గుంతలు పూడ్చివేత

ఇన్నర్‌ రింగ్‌రోడ్డుపై గుంతలు పూడ్చివేత

వెట్‌ మిక్స్‌ వేసి రోలర్‌తో తొక్కిస్తున్న సిబ్బంది 

సీఆర్‌ఎంపీ రోడ్డు నిర్వహణలో భాగంగా పనులు 

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

ఎల్బీనగర్‌: ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తా వరకు  ఉన్న ఇన్నర్‌ రింగ్‌లో ఏర్పడిన గుంతలను వెట్‌మిక్స్‌తో బాగు చేస్తున్నారు. నిర్వహణ బాధ్యతలు సీఆర్‌ఎంపీలో భాగంగా తీసుకున్న సంస్థ కు చెందిన సిబ్బంది గుంతలను పూడ్చే పనులను గురువారం ప్రారంభించారు. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వెట్‌మిక్స్‌ను వేయడంతో పాటుగా రోడ్డురోలర్‌తో గట్టిగా తొక్కిస్తున్నారు. ఇలా ఎల్బీనగర్‌ జోన్‌ వ్యాప్తంగా ఐదు సర్కిళ్ల పరిధిలో ప్రైవేటు సంస్థ నిర్వహణలో ఉన్న రోడ్లను ఆయా సంస్థ తమ సిబ్బంది ద్వారా మరమ్మతులు చేయిస్తున్నది. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.