షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని 27వ వార్డు కౌన్సిలర్ జూపల్లి కౌసల్యశంకర్ ఇంటి ఆవరణలో శుక్రవారం ఉదయం బ్రహ్మకమలం విరబూసింది. శివుడికి అత్యంత ఇష్టమైన బ్రహ్మకమలం అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటి బ్రహ్మకమలం విరబూయడంతో కౌన్సిలర్ సంతోషం వ్యక్తం చేస్తూ పూజలు నిర్వహించారు. విరబూసిన బ్రహ్మకమలాన్ని కాలనీవాసులు వీక్షించారు.