గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 18, 2020 , 00:07:33

బోనాలు ఇంట్లోనే జరుపుకోవాలి

బోనాలు ఇంట్లోనే జరుపుకోవాలి

 బడంగ్‌పేట:  బోనాలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని మంత్రి  సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం తన నివాసంలో మీర్‌పేట కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, అధికారులు సత్యనారాయణ, కిష్టయ్య, టీఆర్‌ఎస్‌ నాయకుడు దీప్‌లాల్‌ చౌహాన్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఆలయాలకు గుంపులుగా రాకూడదన్నారు. నిబంధనలు పాటించి అప్రమత్తంగా ఉండాలన్నారు.  నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులను కోరారు.