సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Sep 10, 2020 , 04:16:12

వీఆర్వో వ్యవస్థ రద్దు సాహసోపేత నిర్ణయం

వీఆర్వో వ్యవస్థ రద్దు సాహసోపేత నిర్ణయం

 మహేశ్వరం/రాజేంద్రనగర్‌ జోన్‌ బృందం: అవినీతిని అంతమొందించేందుకు, ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చిందని బడంగ్‌పేట, మీర్‌పేట మేయర్లు చిగిరింత పారిజాత, దుర్గాదీప్‌లాల్‌చౌహాన్‌ తెలిపారు. బుధవారం శాసనసభలో రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  కార్యక్రమంలో డిఫ్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, పార్టీ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కామేశ్‌రెడ్డి, జల్‌పల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కో -ఆప్షన్‌ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ దూడల శ్రీనివాస్‌గౌడ్‌, యంజాల జనార్దన్‌, షేక్‌ అఫ్జల్‌, గోపాల్‌రెడ్డి, నాగేశ్‌ ముదిరాజ్‌, మహేశ్వరం టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు హనుమగండ్ల చంద్రయ్య, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ సునీతాఆంద్యానాయక్‌, సర్పంచ్‌ ప్రియాంక రాజేశ్‌, నాయకులు యూత్‌ మండలాధ్యక్షుడు దయ్యాల శ్రీనుయాదవ్‌, అంబయ్యయాదవ్‌ తదితరులు  తదితరులు పాల్గొన్నారు. 

  • నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో  నార్సింగి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దారుగుపల్లి రేఖయాదగిరి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలను నిర్వహించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌యాదవ్‌, పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహ, కౌన్సిలర్లు శివారెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
  • రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్‌ తెచ్చిన మార్పుతో ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఆర్కేపురం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ తెలిపారురు. కార్యక్రమంలో ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్‌ గొడుగు శ్రీనివాస్‌ముదిరాజ్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పెండ్యాల నగేశ్‌, హైదరాబాద్‌ మార్కెట్‌ డైరెక్టర్‌ బీరెల్లి వెంకట్‌రెడ్డి, నాయకులు కొండ్ర శ్రీనివాస్‌, లింగస్వామిగౌడ్‌, సాజీద్‌, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 
  •  నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన సందర్భంగా డివిజన్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మన్నె జయేందర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు.. పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ విజేయేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కృష్ణారాంభూపాల్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి,మహేశ్‌గౌడ్‌,  డైరెక్టర్లు సామ ప్రకాశ్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సోషల్‌ మీడియా కన్వీనర్‌ బొక్క దీక్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  • వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం, వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకర్‌ మధుమోహన్‌ అన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి, కౌన్సిలర్లు సప్పిడి లావణ్యరాజు , బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌ గౌడ్‌,  రెడ్డిగళ్ల సుమన్‌ ,రవినాయక్‌ , నాయకులు బాట సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం స్వాగతిస్తూ బుధవారం శంషాబాద్‌లో రైతులు మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్‌, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌, పట్టణ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు వెంకటేశ్‌ గౌడ్‌, చంద్రారెడ్డి, నీరటి రాజు తదితరులు పాల్గొన్నారు.