మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Sep 06, 2020 , 00:37:53

పేదలకు వరం .. సీఎం సహాయనిధి

పేదలకు వరం .. సీఎం సహాయనిధి

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ 

కడ్తాల్‌కు చెందిన బాధితురాలి కుటుంబసభ్యులకు 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

కడ్తాల్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలందరికి వరంలా మారిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల కేంద్రానికి చెందిన కీర్తన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందింది. అనంతరం ఆమె వైద్యానికైన ఖర్చుల సహా యం కోసం సీఎంఆర్‌ రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సహకరించడంతో ఆమెకు రూ.38వేలు మంజూరయ్యాయి. శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితురాలి కుటుంబసభ్యుడికి ఎమ్మెల్యే చెక్కు ను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు కాంటేకార్‌ వెంకటేశ్‌, బీచ్యానాయక్‌ పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నంరూరల్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ కృపేశ్‌ అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన మహేశ్‌ ఆరునెలల క్రితం అనారోగ్యంతో నగరంలోని ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స చేయించుకోగా సుమారు రూ.లక్ష వరకు ఖర్చు అయ్యింది. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధికి ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డి సహకారంతో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి రూ.48వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును శనివా రం మండల పరిషత్‌ కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డితో కలిసి ఎంపీపీ బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షు డు భరత్‌రెడ్డి, సర్పంచ్‌ రవణమోని మల్లీశ్వరి జంగయ్య, వార్డుమెంబర్లు నవనీత, లింగం, టీఆర్‌ఎస్‌ నాయకులు జగన్నాథం, లింగం ఉన్నారు. 

తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సర్పంచ్‌ లింగమ్మ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలం బల్సులపల్లి గ్రామానికి చెందిన రజిని, మాస్టర్‌ కిట్టు అనారోగ్యానికి గురయ్యారు. వైద్యం కోసం బాధితుల కుటుంబసభ్యులు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే బాధితుల కుటుంబ సభ్యులతో ముఖ్యమం త్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. దీంతో రజినికి రూ.18వేలు, కిట్టుకు రూ.20వేల చెక్కులు మంజూరయ్యా యి. కార్యక్రమంలో వార్డు సభ్యులు యాదమ్మ, వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు కిషన్‌, నిరంజన్‌, శ్రీను, మహేందర్‌, రాజు, రవి, బాలకృష్ణ పాల్గొన్నారు.