శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 27, 2020 , 01:40:41

పేదలకు వరం సీఎం సహాయ నిధి

పేదలకు వరం సీఎం సహాయ నిధి

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

ఎల్బీనగర్‌: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు వీలు కలుగుతున్నదని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న న్యూ నాగోలుకు చెందిన తిరుపతయ్యకు మంజూరైన రూ. 36 వేల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును తిరుపతయ్య భార్య లక్ష్మమ్మకు ఎమ్మెల్యే అందజేశారు. పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో నాయకులు అనంతుల రాజారెడ్డి, శివకుమార్‌ పాల్గొన్నారు.