గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Aug 03, 2020 , 00:17:30

పేదలకు వరం సీఎం సహాయనిధి

పేదలకు వరం సీఎం సహాయనిధి

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో మంత్రి సబితారెడ్డి

మహేశ్వరం : సీఎం సహాయనిధి పేదలకు వరమని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. కొత్వాల్‌ చెరువు తండా గ్రామానికి చెందిన జాటో త్‌ రెడ్యా సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ.22 వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును మంత్రి సబితాఇంద్రారెడ్డి తన నివాసంలో ఆదివారం బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సునీతానాయక్‌, ఉప సర్పంచ్‌ లక్ష్మణ్‌నాయక్‌, జాటోత్‌ రవి తదితరులు పాల్గొన్నారు.