ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 04, 2020 , 00:49:36

సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో పేదలకు లబ్ధి

సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో పేదలకు లబ్ధి

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి  

ఎల్బీనగర్‌ : సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో పేదలకు లబ్ధి చేకూరుతున్నదని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం చైతన్యపురి డివిజన్‌లోని మున్సిపల్‌ కాలనీకి చెందిన వసంతలక్ష్మికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. చైతన్యపురి డివిజన్‌ టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు ఎస్‌. చంద్రశేఖర్‌రెడ్డి, కల్యాణ్‌, సాయినాథ్‌, రాజ్‌ పాల్గొన్నారు.