శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jul 08, 2020 , 00:18:30

అప్రమత్తతే..రక్ష

అప్రమత్తతే..రక్ష

మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో విజృంభిస్తున్న కరోనా

భౌతిక దూరం పాటించాలంటున్న అధికారులు

మణికొండ/తుక్కుగూడ:  కరోనా ఎంతటి వారినైనా కాటేస్తుంది. నిర్లక్ష్యంగా ఉంటే ఎప్పుడైనా ఎవ్వరికైనా సోకుతుంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు పాటించాలంటున్నారు అధికారులు. రాజేంద్రనగర్‌, మ హేశ్వరం నియోజకవర్గాల్లో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పరిశ్రమలు ఉన్నందున వలసకూలీలు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా పట్టణాల్లో కేసులు పెరుగుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  అయి నా  కొందరు  ఏమవుతుందిలే అని మాస్కులు ధరించడం లేదని తెలుపుతున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో 11 మంది  పారిశుధ్య  సిబ్బందితో పాటు  మొత్తం 20 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బండ్లగూడ కార్పొరేషన్‌లో ముగ్గురు కార్పొరేటర్లకు, వారి అనుచరులకు, కుటుంబ సభ్యులకు కరోనా సోకింది.  శంషాబాద్‌ మండలం పాలమాకుల, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలో పది కేసుల వరకు నమోదయ్యాయి.  దీనికి కారణం  భౌతిక దూరాన్ని పాటించకపోవడం, శానిటైజర్‌ వాడకపోవడం వల్లనేనని వైద్యులు పేర్కొంటున్నారు. ఇష్టానుసారంగా తిరగడం వల్లే  కేసులు  పెరుగుతున్నాయని తెలుపుతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితోనే  ఎక్కువగా కేసులు నమోదయ్యా యని అధికారులు పేర్కొన్నారు.   అలాంటి వారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అన్ని ప్రాంతాల్లో  కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని  వివ రిస్తున్నారు.  ఎలాంటి అనుమానిత లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.